Food HEROES IDEAS Music జిల్లా కమిటీ యువజన కమిటీలు/ యంగ్ తరంగ్

అనంతపురంలో ఘనంగా  బాల దినోత్సవ వేడుకలు

అనంతపురంలో ఘనంగా  బాల దినోత్సవ వేడుకలు

శ్రీశ్రీ కళావేదిక- పతికి రాజ్యలక్ష్మి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో

ఆకట్టుకున్న బహుభాషా కవిసమ్మేళనం

శ్రీశ్రీ కళావేదిక, పతికి రాజ్యలక్ష్మి ఫౌండేషన్ సంయుక్తంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు స్థానిక ప్రెస్ క్లబ్ లో  శనివారం ఘనంగా నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా ఎస్కేయూ సోషియాలజీ విభాగాధిపతి ప్రొ. జి.వి. రమణ, దిశ డి.ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. విశిష్ట  అతిథులుగా డిసిపిఓ డా. దాసరి సుబ్రమణ్యం, ఆర్ ఐ పి హుసేన్ బాష, గౌరవ అతిథులుగా విశ్రాంత డిఈఓ పగడాల లక్ష్మినారాయణ, యువకవి, జర్నలిస్ట్ డా. ఉద్దండం చంద్రశేఖర్, ఆత్మీయ అతిథులుగా  న్యాయవాది సాకే నరేష్, సీనియర్ కవి కంబదూరి షేక్ నబీరసూల్ పాల్గొని ప్రసంగించారు. 

పలువురు కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు పాల్గొని స్వీయకవితాగానం చేశారు. ఈ సందర్భంగా పలువురికి బాలరత్న,  బాలమిత్ర పురస్కారాలు ప్రదానం చేశారు.

రాజ్యలక్ష్మి ఫౌండేషన్ ఛైర్మన్  డా. పతికి రమేష్ నారాయణ సభకు అధ్యక్షత వహించారు.  శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి గుత్తా హరిసర్వోత్తమ నాయుడు సభాసమన్వయం చేశారు.

కళావేదిక జిల్లా  ప్రధానకార్యదర్శి కొత్తపల్లి సురేష్ బహుభాషా కవిసమ్మేళనం చక్కగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కవులు టి.వి. రెడ్డి, కోటిగారి వన్నప్ప, గోసల నారాయణ స్వామి, గుడిపల్లి విద్యావతి, మధురశ్రీ, మిద్దె మురళి, డా.జూటూరి షరీఫ్, షేక్ రియాజుద్ధీన్, డా. కాపా ఓబిరెడ్డి, యాడికి సూర్యనారాయణ రెడ్డి, లీలామనోహర్, సత్యవాణి, ముత్యాల సుమ, అనిల్ కుమార్, అశోక్ కుమార్, డి.ఏ. కార్తీక్ తదితరులు కవితాగానం చేశారు.

పదిమందికి బాలమిత్ర అవార్డుల ప్రదానం చేసారు 

Avatar

rishisrisri

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *