HEROES కన్వీనర్ రాష్ట్ర కమిటీ

ఐ.ఎస్.ఒ. గుర్తింపు పొందిన తొలి సాహిత్య సంస్థ   శ్రీ శ్రీ కళావేదిక

గత 11 సంవత్సరాలుగా ఎన్నో సాహిత్య, సాంస్కృతిక ,సామాజిక  కార్యక్రమాలను నిరంతరంగా అందిస్తున్న శ్రీ శ్రీ కళావేదికకు సంస్థ కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్    (ఐ.ఎస్.ఓ) గుర్తింపు లభించింది . అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ…తెలుగు సాహిత్య చరిత్రలో  ఐ.ఎస్.ఓ గుర్తింపు పొందిన మొదటి సంస్థగా సాహిత్య సంస్థగా శ్రీ శ్రీ కళావేదిక  నిలిచింది.  దీనికి సంబంధించిన ధృవపత్రాన్ని లండన్ కు చెందిన ఒటాబు అంతర్జాతీయ సంస్థ ఇచ్చే ప్రతిష్టాత్మక ఐ.ఎస్.ఓ .సర్టిఫికెట్ ను ఆ సంస్థ   ప్రతినిధులు అందచేశారు . అంతర్జాతీయ స్థాయిలో అనేక సాహిత్య కార్యక్రమాలు చేపట్టినందుకు సంస్థకు గుర్తింపు లభించింది .  అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించే సంస్థలకు ఐఎస్ఓ ప్రత్యేకంగా సర్టిఫికెట్లను అందజేస్తుంది. అంతర్జాతీయంగా దీనికి ప్రాధాన్యత ప్రామాణికంగా కూడా చూస్తారు.  అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న సాహిత్య సంస్థగా శ్రీశ్రీ కళావేదికకు ఈ గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రముఖ రచయిత, కవి , ప్రభుత్వ  జాషువా కవి పురస్కార గ్రహీత   శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కు వారు అభినందనలు తెలిపారు . గత 11 సంవత్సరాలుగా ఎన్నో సాహిత్య , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో కవులకు గుర్తింపు కలిగించిన వేదికగా శ్రీ శ్రీ కళావేదిక నిలిచింది  . ప్రసిద్ధ పుణ్యక్షేత్రం  అంతర్వేదిలో 2015 సంవత్సరంలో  లో  30 గంటల 30 నిముషాల 30 సెకన్ల పాటు  వరల్డ్ రికార్డు కవి సమ్మేళనం ఏర్పాటు చేసి 1500 వందలమంది కవులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చారు. ఇది  పలు వరల్డ్ రికార్డులలోనమోదుఅయ్యింది.అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా  మలికిపురంలో నాన్ స్టాప్ కళాకారుల 12గంటలపాటు  ప్రదర్శన  ఏర్పాటు చేసి రికార్డు నెలకొల్పి కళాకారులందరికి గుర్తింపు తీసుకు వచ్చింది శ్రీశ్రీ కళావేదిక  . పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో2022 మార్చి 13, 14 తేదీలలో ప్రపంచ కవితోత్సవం పేరిట  24 గంటల 24 నిముషాల  24  సెకన్ల కవి సమ్మేళనాన్ని నిరవధికంగా నిర్వహించారు . ఇది పలు రికార్డులలో నాడు సృష్టించింది .  ఆంద్రా తెలంగాణా  కర్ణాటక , గుజరాత్, డిల్లీ రాష్ట్రాల్లో అనేక జాతీయ స్థాయిలో కవి సమ్మేళనాలు నిర్వహించిన ఘనత శ్రీ శ్రీ కళావేదికకే దక్కుతుంది  .ఇప్పటి వరకు  100 కు పైగా జాతీయ శత  కవి సమ్మేళనాలు అనేక చోట్ల నిర్వహించి  ఏ విధమైన రిజస్త్రేషన్  రుసుము లేకుండా కవులందరిని సత్కరించిన ఘనత  కూడా శ్రీశ్రీకళావేదికకే  దక్కింది . అన్ని ప్రాంతాల్లో మరియు అన్ని జిల్లాల్లో   జాతీయ శతకవి  సమ్మేళనాలు  నిర్వహిస్తున్న  ఏకైక సంస్థగా  శ్రీ శ్రీ కళావేదిక పేరొంది ప్రముఖుల ప్రసంశలు పొందింది  . అదే విధంగా , దుబాయి , కువైట్ , మలేషియా దేశాలలో కూడా శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో  కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు విదేశాల్లో సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారన్నారు. 2021 ఏప్రిల్ నెలలో రాజమహేంద్రవరం లోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో కూడా జాతీయ స్థాయి ఉగాది  కవి సమ్మేళనం నిర్వహించాము  .  తణుకు పట్టణంలో 2021 మార్చి 24 న జాతీయ శతాధిక కవి సమ్మేళనం  నిర్వహించాము . 2021 లో నవంబర్ 11 న  అమలాపురం పట్టణంలో  మరో జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళనం ఘనంగా శ్రీ శ్రీ కళావేదిక సభ్యులు నిర్వహించారు . 2021 అక్టోబర్ నెలలో భద్రాద్రి కొత్తగూడెం జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు .  . 2021 డిసెంబర్  17 వ తేదీన  తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జాతీయ సాహిత్య సదస్సు మరియు కవి సమ్మేళనం ను అత్యంత వైభవంగా  నిర్వహించారు. సుమారు 200 మంది తెలుగు కవులు పాల్గొన్నారు . శ్రీ శ్రీ సాహిత్యం , బోయి భీమన్న సాహిత్యంపై పాత్ర సమర్పణ చేసారు .    అదే విధంగా తెలంగాణా రాష్ట్రం  మంచిర్యాల జిల్లాల్లో 2022  పిబ్రవరి 27 న లో జాతీయ శతాదిక కవి సమ్మేళనాన్ని నిర్వహించారు . ఏప్రిల్ నెలలో 30వతెదీన శ్రీ శ్రీ జయంతి సందర్భంగా విశాఖపట్టణం ఆంధ్రాయూనివర్సిటీ లో జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని నిర్వహించి కవులను సత్కరించారు . నిరంతర సాహితీ 

యజ్ఞంగా శ్రీ శ్రీ కళావేదిక తెలుగు భాషను , తెలుగు వైభవాన్ని , తెలుగు కవిత్వాన్ని , తెలుగు కవులను , రచయితలను ప్రోత్సహిస్తూ ఎన్నో సాహిత్య కార్యక్రమాలు చేపడుతూ సాహిత్య చరిత్రలో కవులకు ఒక దిక్సూచిలా నిలిచింది . ప్రతిభకు పట్టాభిషేకం కడుతూ వేలాదిమంది వర్ధమాన కవులకు శ్రీ శ్రీ కళావేదిక ఒక కర్మాగారంగా మారింది అనడంలో అతిశయోక్తిలేదు 

`

Avatar

rishisrisri

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *