HEROES జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ

తణుకులో ఘనంగా శ్రీ శ్రీ కళావేదిక జాతీయ శతాధిక కవి సమ్మేళనం

పశ్చిమగోదావరి జిల్లా  తణుకులో  బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సౌజన్యంతో శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో కలాలు -గళాలు పేరిట శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో జాతీయ స్థాయి  శత  కవి సమ్మేళనం నిర్వహించారు .వివిధ ప్రాంతాలనుండి వచ్చిన వందమంది కవులు కవితాగానం చేశారు. కార్యక్రంలో  శ్రీ శ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన రిషి తణుకు తో పాటు పశ్చిమ గోదావరి  జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు . అనంతరం శ్రీ శ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి రిషి తణుకు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీ లక్ష్మి మాట్లాడుతూ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కవి సమ్మేళనం నిర్వహించి కవులందరిని ఒకే వేదిక మీదికి చేర్చడం ద్వారా సాహిత్య పరిఢవిల్లుతోందన్నారు .శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ , ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ సభ్యుడు , ప్రభుత్వ జాషువా అవార్డు గ్రహీత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ శ్రీ శ్రీ కళావేదిక నిరంతర సాహితీ యజ్ఞంలో భాగంగా  కవులను , కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు.  తొలుత తిలక్ విగ్రహానికి , శ్రీ శ్రీ  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు .  సాహిత్య అకాడమీ చైర్ పర్సన్  శ్రీలక్ష్మి , శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ లు కవులను ఘనంగా సత్కరించారు . 

 శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన  జాతీయ స్థాయి శత కవి సమ్మేళనం ఆద్యంతం అలరించింది . వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కవులు పలు సామాజిక సమస్యలపై కవితాగానం చేశారు . కరోనా పై ఎక్కువగా కవితలు సంధించారు . అనంతరం కవులను సత్కరించారు

Avatar

rishisrisri

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *