Action Tech జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ

కవి సమ్మేళనాలు నాంది పలికిన   అంతర్వేది  ప్రపంచ తెలుగు కవితోత్సవం

కవి సమ్మేళనాలు నాంది పలికిన   అంతర్వేది  ప్రపంచ తెలుగు కవితోత్సవం

  పలు  రికార్డ్ బుక్ లలో నమోదు కాబడిన    సాహితీ ప్రస్థానం

తొలి  తెలుగు ప్రపంచ కవితోత్సవం ఒక నివేదిక

ఇటు సముద్రం … అటు గోదావరి కలిసే సాగర సంగమం ప్రదేశం అంతర్వేది నందు 2015అక్టోబర్ 17, 18 తేదీలలో నిర్వహించిన ప్రపంచ తెలుగు కవితోత్సవం సాహితీ చరిత్రలో ఒక మైలురాయి . సుమారు 2000 మంది కవులు ఒకే వేదికపై ఏకధాటిగా 30 గంటల 30 నిముషాల 30 సెకన్లపాటు కవితాగానం చేయడం అనేక రికార్డులు  సృష్టించినట్టయ్యింది . సాహితీ చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక సాహిత్య పయనం గా అంతర్వేది ప్రపంచ కవితోత్సవాన్ని చెప్పవచ్చు , తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది అనే మారుమూలగ్రామం లో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయ సమీపంలో ఈ ప్రపంచ కవితోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించారు ..ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు హైదరాబాద్ మరియు ఇతర సమీప ప్రాంతాలకు చెందిన కవులు ప్రత్యేకంగా ఒక రైలు బోగీని రిజర్వేషన్ చేసుకుని రావడం ఇంకా విశేషంగా చెప్పవచ్చు . 30 గంటలు అనుకున్న కవి సమ్మేళనం కవులు  ఎక్కువగా రావడంతో 32 గంటలు పాటు సాగింది . అన్ని ప్రాంతాలనుండి కవులు హాజరయ్యారు .

ఎందరో వర్ధమాన కవులకు  ఈ ప్రపంచ కవితోత్సవం వేదిక ఒక దిక్సూచిగా నిలిచింది .చాలామందికి  కవిత్వపు ప్లాట్ పామ్ గా నిలిచింది . ఎందరికో పేరు తీసుకొచ్చింది .

ప్రముఖ కవి, రచయిత  ప్రభుత్వ జాషువా పురస్కార గ్రహీత ,సాహిత్య అకాడమీ సభ్యుడు (పూర్వ) డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కన్వీనర్ గా నిర్వహించిన ఈ ప్రపంచ కవి సమ్మేళనం ఒక పండుగలా సాగింది . 

కవులందరికి రుచికరమైన వంటకాలు , టిఫిన్లు , సాయంత్రం పూట పకోడీలు….  అస్సలు  ఉదరం ఖాళి లేని విందుకు కవులందరూ ఫిదా అయ్యారు .  ఉండేందుకు అందరికి వసతి సౌకర్యం కలించారు .  ఇలా అన్ని వసతులు  సమకూర్చారు . అప్పట్లో కవి సమ్మేళనం అంటే ఒక నలభై లేదా యాభై మందితో జరిగేవి . తొలిసారిగా ఇంతమంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించడం తన జీవితంలో చూడలేదని ప్రముఖ కవి  స్వర్గీయ అద్దేపల్లి రామ్మోహనరావు సభలో ఆశ్చర్య ప్రసంగం చేయడం ఇప్పటికి మరుపురానిది . ఎక్కడ చూసినా కవులతో  కవిత్వంతో అంతర్వేది మార్మోగింది .

పలు సాహితీ సంస్థలు ఈ కవి సమ్మేళనంలో ప్రముఖ పాత్ర వహించాయి . విశేషం ఏమిటంటే ఒక్కొక్క కవితా ఆవృతానికి ప్రత్యేకించి లాటరీ నిర్వహించి కవులకు బహుమతులు అందించడం జరిగింది . కవి సమ్మేళనంలో అతిధులుగా ప్రముఖులు కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత శివారెడ్డి ,పొట్లూరి హరికృష్ణ  పద్మ భూషణ్ బోయి భీమన్న సతీమణి బోయి హైమావతి ,  ప్రసాదమూర్తి , తోపుడుబండి సాదిక్, శిఖామణి, దాట్ల దేవదానం రాజు , గిడ్డి సుబ్బారావు , అప్పటి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావులు అతిధులుగా హాజరయ్యారు . ప్రముఖ కవులందరూ ఒక్కో సెషన్ కి విశిష్ట అతిధులుగా ఉన్నారు . 

అంతర్వేది ఒక సాహితీ కెరటంలా ఉప్పొంగినట్టయ్యింది . వేలాది కవితా గొంతుకలు కవిత్వాన్ని వినిపించాయి . ఎన్నో గొంతుకలు తొలి  వేదికగా అరంగేట్రం  చేశాయి . వేదికపై పలు పుస్తకాలు ఆవిష్కరించారు . భారత్ బుక్ ఆఫ్ రికార్డ్ , వర్మ బుక్ ఆఫ్ రికార్డ్ , ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇలా అనేక రికార్డుల్లో ఈ కవి సమ్మేళనం ఒక ప్రపంచ రికార్డుగా నమోదు కాబడింది ఇదొక సాహిత్య వింతగా నిలిచిపోయింది. 

కువైట్ ఎన్నారై టీమ్ ప్రత్యేక యూనిఫామ్ లో సేవలందించడం డాక్టర్ ప్రతాప్ నేతృత్వంలో కవులందరూ కవితా పఠనం చేయడం , పాల్గొన కవులందరిని మెమెంటో శాలువా మరియు డాక్టర్ ప్రతాప్ రాసిన రాలిపోయే కాలం కవితా సంకలనం ఇచ్చి ఘనంగా సత్కరించడం జరిగింది . . విశిష్ట అతిధులుగా విచ్చేసిన సీనియర్ కవులందరూ కవితా గానం చేశారు . సాహిత్య దిగ్గజాలందరు ఆవృత్తాలు నిర్వహించారు . ఇది మరుపురాని మధురానుభూతిగా చెప్పవచ్చు . ఆ తర్వాతే కవి సమ్మేళనాలు విరివిగా ఏర్పాటు చేయడం , కవులను గుర్తించడం తో పాటు కవి సమ్మేళనాలకు   ఎక్కువ గుర్తింపు వచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు . 

Avatar

rishisrisri

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *