Racing కన్వీనర్ యువజన కమిటీలు/ యంగ్ తరంగ్

నిరంతర సాహిత్య వేదిక – శ్రీ శ్రీ కళావేదిక డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో 

ఒక సాహిత్య అంకురం పెద్ద సాహిత్య వృక్షంగా ఎందరికో ఆదర్శంగా మారుతుందని అనడానికి శ్రీ శ్రీ కళావేదిక ఒక నిదర్శనం . సాహిత్యం , కవిత్వం ఎవరి సొత్తు కాదు అని … సాహిత్యాభిలాషులను , కవులను ప్రోత్సహించడమే ధ్యేయంగా పనిచేస్తుంది శ్రీ శ్రీ కళావేదిక .

ఐ ఎస్  ఓ గుర్తింపు  పొంది అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించి తెలుగు రాష్ట్రాల్లో వర్ధమాన సాహిత్యవేత్తలకు , కవులకు ఒక వేదికగా నిలుస్తున్నారు . సాహిత్యం కూడా వ్యాపారధోరణిగా మారిన ఈ రోజుల్లో స్వంత ఖర్చులతో అడ్మిన్స్  ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు .2000 సంవత్సరం నుండి నిరంతరం ఒక సాహితీ యజ్ఞంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . ఇప్పటివరకు వేలాది మంది కవులను సత్కరించారు . తూర్పు గోదావరి జిల్లా , పశ్చిమ గోదావరి జిల్లా , కృష్ణా జిల్లా , తిరుపతి జిల్లా , హైదరాబాద్ , నిజామాబాద్ , కామారెడ్డి ఇలా తదితర ప్రాంతాల్లో ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు .

ఆదికవి నన్నయ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో కవి సమ్మేళనం

ఉగాది సందర్భంగా రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కవి సమ్మేళనం నిర్వహించిన ఘనత శ్రీ శ్రీ కళావేదికకే దక్కుతుంది . ప్రామాణికమైన అంతర్జాతీయ సంస్థ గా గుర్తింపు పొందినందుకు శ్రీ శ్రీ కళావేదికను  యూనివర్సిటీ గుర్తించడం హర్షణీయం . అదే విధంగా ఆంద్రప్రదేశ్ భాషా సాంస్కృతికశాఖ మరియు శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు . పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరులో  జాతీయ స్థాయి కవి సమ్మేళనాలు నిర్వహించి వందలాది మంది కవులను శాలువా , జ్ఞాపిక  , పూల దండ , సర్టిఫికెట్ తో సత్కరించిన ఘనత శ్రీ శ్రీ కళావేదికకే దక్కుతుంది . 2015లో అంతర్వేది వేదికగా డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో తొలిసారిగా 30 గంటల 30 నిముషాల 30 సెకన్ల ఏకధాటి  తెలుగు ప్రపంచ కవితోత్సవం పేరిట  కవి సమ్మేళనం నిర్వహించి వరల్డ్ రికార్డ్ సాధించారు . హైదరాబాద్ రవీంద్రభారతి లో రెండు సార్లు జాతీయ స్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు .అదే విధంగా  దుబాయి , కువైట్ దేశాలలో కూడా శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాల రూపకల్పన చేసింది. పలు దేశాల్లో శ్రీ శ్రీ కళావేదిక కమిటీలు ఉండటం అభినందనీయం . 

గత 2010 నుండి నిరంతర సాహిత్య ప్రయాణంలో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో కళావేదిక ఎన్నో సాహిత్య కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందింది . సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఎన్నో సాహిత్య కార్యక్రమాలకు ఊపిరిపోస్తున్నారు . కవులను కళాకారులను గుర్తిసూ సత్కరిస్తున్నారు . మలికిపురం నాన్ స్టాప్ కళాకారుల ప్రదర్శన ఏర్పాటు చేసి 300వందల మంది కళాకారులను ఒకే మీదికి తీసుకొచ్చిన ఘనత ఒక్క శ్రీ శ్రీ కళావేదికకే దక్కుతుంది . కరోనా సమయంలో  జూమ్ వేదికగా ప్రస్తుతం కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు . అనేక కవితాపోటీలు నిర్వహించి ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తున్నారు .    సోషల్ మీడియా ద్వారా కూడా అనేక సాహిత్య కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు . శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కార్యవర్గం డా.  ఆరవల్లి నరేంద్ర , కొల్లి రమా వతి , చిట్టే లలిత , ఇండ్ల సంధ్య , చిందం సునీత , ఓకోయిల నవీన్ రిషి తణుకు , మిరప మహేష్, సాహితీ వేత్త కర్ణాటక సంస్థ అధ్యక్షుడు  శ్రీనివాస్ వాసుదేవ్ , ఆధ్వర్యంలో సోషల్ మీడియా వేదికగా కవితా సమీక్షలు , కవిత్వం ఒక పరిశీలనా , పుస్తక సమీక్ష , కవి పరిచయం , పుస్తక పరిచయం తదితర కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు . ఇటీవల కాలంలో శ్రీ శ్రీ కళావేదిక ద్వారా అనేక కవితా సంకలనాలు ప్రచురించడం జరిగింది . అదే విధంగా బాల్యం  పారిశుధ్య కార్మికులు వెంటాడే జ్ఞాపకాలు  , ట్రాన్ జెండర్స్ పై , బాల కార్మికులపై   పై ఈ కవితా సంకలనాలు తీసుకువచ్చారు .కవులకు , కళాకారులకు  ప్రోత్సాహం , గుర్తింపు ఇవ్వడమే మా ధ్యేయం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులు , శ్రీ శ్రీ కళావేదిక ఛైర్మెన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు . నిరంతర సాహిత్య పయనం శ్రీ శ్రీ కళావేదిక లక్ష్యమన్నారు . కవి సమ్మేళనాలు , సాహిత్య సభలు , పుస్తక ప్రచురణలు , కవిత్వ వర్క్ షాపులు , సాహిత్య విశ్లేషణ సభలు , పుస్తక పరిచయాలు తదితర  సాహిత్య కార్యక్రమాలు చేయడమే ధ్యేయమన్నారు . కవిత్వం , సాహిత్యం ఎవ్వరి సొత్తు కాదని అన్నారు . ప్రతిభే అందరికి ప్రామాణికమని ప్రతాప్ తెలిపారు .

Avatar

rishisrisri

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *