Music Racing Travel జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ

రవీంద్రభారతిలో  కత్తిమండ సారధ్యంలో   వైభవంగా  జాతీయ సాహిత్య సదస్సు

  • శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో కన్నుల పండుగగా శతాధిక కవులకు సత్కారం             
  • పలు పుస్తకావిష్కరణలు -పత్ర సమర్పణలు              
  • శ్రీ శ్రీ కళావేదిక సాహితీ సమరంలో మరో మైలురాయి

కొన్ని కలల సాకారం నెరవేరిన వేళ…కొన్ని భావాలు కలిసిన చోటు ..సాహితీ , సినీ  ప్రముఖుల సమక్షంలో అంతర్జాతీయ సాహిత్య సంస్థ  శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ లోని కళల కాణాచి రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ సాహిత్య సదస్సు మరియు శతాధిక కవుల సత్కారం అత్యంత వైభవంగా సాగింది . వివిధ రాష్ట్రాలనుండి కవులు రవీంద్రభారతి వేదికగా కలుసుకున్నారు .

శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బోయి భీమన్నసాహితీ నిధి చైర్ పర్సన్ బోయి హైమవతి  భీమన్న ముఖ్య అతిధిగా హాజరయ్యారు . 

తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు . అనంతరం  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తో పాటు అతిధులు  శ్రీ శ్రీ చిత్రపటానికి ,మరియు పద్మభూషణ్ బోయి భీమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

ఈ   సందర్భంగా విశిష్ట అతిధిగా హాజరైన తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ  సమావేశంలో మాట్లాడుతూ కవిత్వం ఎల్లలు లేనిదని అన్ని రాష్ట్రాల కవులను రవీంద్ర భారతి వేదిక మీదకు తీసుకురావడంలో శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ ప్రతాప్ కృషి అభినందనీయమన్నారు . భాషా , సంస్కృతి పరి రక్షణలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. నేడు సమాజహితం కోరే రచనలు అవసరమని సూచించారు.

కవిత్వం ఎప్పుడు దిశా , నిర్దేశాలు కలిగి ఉండాలన్నారు . మరో అతిధి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్ పర్సన్  పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ రవీంద్రభారతి వేదిక ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుందని సాహిత్యం పరిఢవిల్లే విధంగా శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శతాధిక కవులను ఒకే వేదిక మీదికి తీసుకు రావడం ప్రశంసనీయమన్నారు . సాహిత్యంకు ప్రాంతాలతో సంబంధం లేదన్నారు . శ్రీ శ్రీ కళావేదిక జాతీయ సాహిత్య సదస్సు నిర్వహించడం, కవులను సత్కరించడం కవులు చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు . ముఖ్య అతిథిగా విచ్చేసిన బోయి హైమవతి మాట్లాడుతూ రవీంద్రభారతి లో ఇంతమంది కవులను ఒకే చోట తీసుకొచ్చిన ఘనత శ్రీ శ్రీ కళావేదికకే దక్కుతుంది అన్నారు .

డాక్టర్ ప్రతాప్ సారధ్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగడం కవులు చేసుకున్న అదృష్టమన్నారు.ప్రతాప్ సాహిత్య సేవలు వెలకట్టలేనివాని అన్నారు . సాహిత్యం ఎప్పుడు సామాజిక చైతన్యం కోరుకోవాలన్నారు . మరొక అతిధిగా విచ్చేసిన తెలంగాణా ఎమ్మెల్సీ , ప్రముఖ వాగ్గేయయకారుడు గోరెటి వెంకన్న మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా ఉన్న రవీంద్రభారతిలో శ్రీ శ్రీ కళావేదిక ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు . కవులు , కళాకారులు సాహిత్య చైతన్యం తీసుకురావాలన్నారు .ఈ వేదికపై పుస్తకావిష్కరణలు జరగడం ఒక గొప్ప వరం అన్నారు .  జబర్దస్త్ నటుడు , రచయిత మురళీధర్  మాట్లాడుతూ కవులు కళాకారులు , రచయితలు సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని కోరారు . 

శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ వర్ధమాన కవులను ప్రోత్సహించే దిశగా శ్రీ శ్రీ కళావేదిక పని చేస్తుందన్నారు .ప్రతిభకు పట్టాభిషేకం చేయాలనే నినాదంతో కవులను , కళాకారులని నిరంతరం ప్రోత్సహిస్తున్నామన్నారు. కవి కాలానికి ముందుమాట రాసేవాడిలా ఉండాలన్నారు. అప్పుడే ఆ కవికి గుర్తింపు వస్తుందన్నారు .కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . యువ కవులకు ప్రోత్సహించేందుకు వర్క్ షాపులు నిర్వహిస్తున్నామన్నారు . ఇంకా సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు .

ప్రతిష్టాత్మకంగా జాతీయ సాహిత్య సదస్సు

————————————————
శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి , శ్రీ శ్రీ కళావేదిక కర్ణాటక  రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ వాసుదేవ్ నిర్వహణలో జాతీయ సాహిత్య సదస్సు ప్రతిష్టాత్మకంగా జరిగింది . సభలో చిట్టే లలిత పద్మభూషణ్ బోయి భీమన్న రచనలపై , ఫిజిక్స్ అరుణ్ కుమార్ శ్రీ శ్రీ అనంతం పై , పుల్లే టికుర్తి శ్రీనుబాబు గుర్రం జాషువా రచనలపై , ఈశ్వరి యద్దనపూడి సులోచనారాణి రచనలపై పత్ర సమర్పణలు చేశారు .

రవీంద్రభారతి  వేదికపై  పలు పుస్తకావిష్కరణలు

————————————————–

శ్రీ శ్రీ కళావేదిక పబ్లికేషన్ పై ముద్రించిన  శ్రీ శ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు , కవయిత్రి కొల్లి రమా వతి రాసిన జ్ఞాపకాల దొంతర , జాతీయ కార్యదర్శి డాక్టర్ ఐ . సంధ్య రాసిన శిశిరం , కామారెడ్డి జిల్లా అధ్యక్షడు  జెట్టబోయిన  శ్రీకాంత్ రాసిన  కవితాశ్వమేధం , కడప జిల్లా అధ్యక్షుడు  ఉదయగిరి దస్తగిరి రాసిన చద్దికూడు , కృష్ణా జిల్లా అధ్యక్షుడు , రాష్ట్ర కార్యదర్శి  పుల్లేటికుర్తి శ్రీనుబాబు రాసిన అంకురార్పణ , గిరి రాసిన కథలు పుస్తకాన్ని ప్రముఖుల చేతులమీదుగా ఆవిష్కరణ చేశారు  .

నర్సిగాడు -నాయుడమ్మ లోగో ఆవిష్కరణ

———————————————-
సమావేశంలో శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కార్యదర్శి ,ప్రముఖ కవి , రచయిత రిషి తణుకు రాస్తున్న నర్సిగాడు -నాయుడమ్మ నవల లోగోను బోయి హైమావతి , పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ,గోరెటి వెంకన్న , జబర్దస్త్ మురళి లు ఆవిష్కరించారు. 
కన్నుల పండుగగా శతాధిక కవులకు సత్కారం
—————————————————–
శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన 175 మంది కవులను అతిధుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు , జ్ఞాపిక , శాలువా , ప్రశంసాపత్రం , పూలదండతో కవులను ఘనంగా సత్కరించారు . కార్యక్రమం ప్రారంభం నుండి ఆద్యంతం కన్నులపండుగగా సాగింది . కవులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు  కార్యక్రమంలో ముగింపుగా బతుకమ్మ ఆట తో మహిళా కవయిత్రులు అలరింపచేశారు .

Avatar

rishisrisri

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *