FANTASY Fashion IDEAS News కన్వీనర్

కందుకూరులో అలరించిన  శ్రీ శ్రీ కళావేదిక జాతీయ శతాధిక కవి సమ్మేళనం

కందుకూరులో అలరించిన  శ్రీ శ్రీ కళావేదిక జాతీయ శతాధిక కవి సమ్మేళనం

  • పాల్గొన్న 200 మంది కవులు 
  • డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో కవులకు సత్కారం ఈశ్వరీ భూషణం పర్యవేక్షణలో ఘనంగా  కార్యక్రమం 

గోదావరి విలేఖరి -ప్రకాశం 

  ఐ .ఎస్ ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ  శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో  ఉమ్మడి ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కందుకూరులో జాతీయ స్థాయిలో  నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనం సాహితీ చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచింది . ఒక పండుగ వాతావరణంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు . శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి జి . ఈశ్వరీ భూషణం ఆధ్వర్యంలో కనివినీ రీతిలో కవి సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది . 

ఉమ్మడి ప్రకాశం జిల్లా శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో లక్ష్మి తిరుమల కళ్యాణ మండపం నందు ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై  కవి సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.  ముఖ్య అతిధిగా  కందుకూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి  మానుగుంట మహీధర్  రెడ్డి మాట్లాడుతూ సమాజాభివృద్ధికి దోహదపడే కవిత్వం మరింత మెరుగ్గా రాణించేందుకు శ్రీశ్రీకళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు .   

కందుకూరు లో మొదటిసారిగా ఇంత గొప్ప సాహిత్య  కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు . కవులను , కళాకారులను ప్రోత్సహిస్తున్న శ్రీ శ్రీ కళావేదిక సేవలను కొనియాడారు . మరో ముఖ్య అతిధిగా శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ  శ్రీ శ్రీ కళావేదిక నిరంతర సాహితీ యజ్ఞంలో భాగంగా  ఉభయ తెలుగు రాస్త్రాలో నెలకొక జిల్లాలలో   కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు .సాహిత్యం ఎప్పుడు సమాజ హితం కావాలని ఆ దిశగా కవులు తమ కలాలు సందించాలని కోరారు  .సామాజిక చైతన్యంతో కవిత్వం రాయాలని కవులకు పిలుపు నిచ్చారు . 

యువకవులు సమాజాభివృద్ధి దిశగా మరింత కృషి చేయాలని కోరారు.  సుమారు200 మంది కవులు ఈ కవి సమ్మేళనంలో పాల్గొనున్నారు . ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిస్సా , గుజరాత్ , మహారాష్ట్ర ,  పాండిచ్చేరి ,ఢిల్లీ  తదితర రాష్ట్రాలనుండి కవులు హాజరుకానున్నారు . శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో కవులందరిని మెమెంటో , శాలువా , పూలదండా , ప్రశంసా పత్రంతో సత్కరించారు .  . శ్రీ శ్రీ కళావేదిక  ప్రధాన కార్యదర్శి ఈశ్వరీ భూషణం అధ్యక్షతన కవి సమ్మేళనం ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యింది .

కవులకు ఉదయం అల్పాహార విందు ఏర్పాటు చేసారు .మధ్యాహ్నం  పసందైన విందు కవులందరికీ ఏర్పాటు చేసారు . ఈ సందర్భంగా  ప్రధాన కార్యదర్శి , ఉపాధ్యాయురాలు  ఈశ్వరీ భూషణం మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం లో ఇంత భారీ స్థాయిలో   కవి సమ్మేళనం నిర్వహించడం ఇదే ప్రధమం అన్నారు . కవులందరికి కవితా గానం అవకాశం కలిపించారు . కవులందరికీ వినూత్నంగా  ఈశ్వరీ ఆధ్వర్యంలో మాంసాహార బోజన సదుపాయం , శాకాహార బోజన సదుపాయం లతో పాటు  ఐస్ , కీం , కిళ్ళీ ఏర్పాట్లు చేసారు . జాతీయ కన్వినర్ కొల్లి రమా వతి మాట్లాడుతూ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించామన్నారు .

శ్రీ శ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి పిల్లి హాజరత్తయ్య రాసిన వెలుగు దివ్వెలు , కార్యదర్శి వుటుకూరి మహేష్ రాసిన అమ్మ మాట తప్పింది , వరంగల్ కార్యదర్శి హరీష్ రాసిన హరాక్షరి  పద్య కవిత్వం తెలంగాణా  శ్రీ శ్రీ కళావేదిక ప్రధాన కార్యదర్శి  వైరాగ్యం  ప్రభాకర్ సంపాదకత్వంలో మనలో శ్రీ శ్రీ  కవిత్వ సంపుటులను  ఎమ్మెల్ల్యే మహీధర్ రెడ్డి ,చైర్మన్  డాక్టర్ కత్తిమండ ప్రతాప్ లు ఆవిష్కరణ చేసారు . అదే విధంగా కృష్ణవేణి పరాంకుశం కృష్ణా తరంగాలు నా అంతరంగాలు  ముఖ చిత్రం ను కూడా ఆవిష్కరణ చేసారు . వై నాగభూషణం  కార్యక్రమ అన్ని ఏర్పాట్లును ఘనంగా నిర్వహించారు    కార్యక్రమంలో    జాతీయ ఉపాధ్యక్షురాలు చిట్టే  లలిత , శ్రీ శ్రీ కళావేదిక  మీడియా ప్రతినిధి అమ్ము బమ్మిడి , కార్యదర్శి  పుల్లేటికీర్తి శ్రీను బాబు ,   పిల్లి హాజరత్తయ్య , నాసరయ్య , మహేష్ , మస్తానయ్య , అంజయ్య , సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు

Avatar

rishisrisri

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *