Action Fashion Gaming Music యువజన కమిటీలు/ యంగ్ తరంగ్ రాష్ట్ర కమిటీ

శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మంచిర్యాలలో అలరించిన నాన్ స్టాప్ కళా ప్రదర్శనలు 

శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మంచిర్యాలలో అలరించిన నాన్ స్టాప్ కళా ప్రదర్శనలు

  • కన్నులపండువగా 24 గంటల 24 నిముషాల 24 సెకన్ల రంగస్థలం 
  • కత్తిమండ సారధ్యంలో  నాలుగు ప్రపంచ రికార్డుల్లో నమోదు
  • రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు 

రంగస్థలం  వేదికపై 24 గంటలు పాటు నిర్విరామంగా క్షణం కూడా గ్యాప్ లేకుండా కళా ప్రదర్శనలు భళా అనిపించాయి . దేశం నలుమూలలు నుండి మరియు విదేశాల్లో ఉన్న తెలుగు కళాకారులు అందరు ఒకే వేదికపై కళా ప్రదర్శనలు చేయడం ఒక రికార్డు సృష్టించింది.

మంచిర్యాల కళాకారుల ప్రదర్శన ప్రపంచ స్థాయిలో నిలిచింది . కన్నులపండుగగా సాగిన ఈ కార్యక్రమంలో . నాటకాలు , నాటికలు , మిమిక్రి , మేజిక్ , కూచిపూడి , డప్పు ప్రదర్శనలు , కోలాటం , బతుకమ్మ , కరాటే ఫైర్ , ఏకపాత్రలు , జానపదం , ఆదివాసి నృత్యాలు , డాన్స్ , భరతనాట్యం .మయూర నాట్యం , కవి సమ్మేళనం , ఒగ్గు కథలు , బుర్రకథలు , యక్ష గానం , సంగీతం , సితార , టీన్ మార్ , రోడ్డు షో , ఇలా ఎన్నో కళా ప్రదర్శనలు నిర్వహించారు .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ భారతి హోల్లీకేరి ,హాజరయ్యారు .  ప్రపంచం నలుమూలల కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత శ్రీశ్రీకళావేదిక కే చెల్లిందని, కళలను ప్రోత్సహించేందుకు చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేస్తున్న కృషి అనిర్వచనీయమైనదని మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్లికేరి ప్రశంసించారు.

తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీశ్రీకళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా. ప్రతాప్  నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి నిర్వహించిన 24 గంటల 24 నిమిషాల 24 సెకెన్ల “ప్రపంచ స్థాయి నాన్ స్టాప్ కళాకారుల ప్రదర్సన” లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ భారతి హోళ్లికేరి మాట్లాడుతూ ఇంతమంది కళాకారుల ప్రదర్సన కు మంచిర్యాల ను వేదికను చేసిన భాగ్యలక్ష్మి కృషి అభినందనీయం అన్నారు.  అనంతరం అతిథులను ఆమె చేతుల మీదుగా శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.

మరో అతిధిగా  మంచిర్యాల శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు హాజరై కళాకారులను సత్కరించారు .    
వందలాది మంది కళాకారులు వినూత్న కళా ప్రదర్శనలకు శ్రీశ్రీకళావేదిక వేదిక కావడం సంతోషించదగిన విషయం అని, వీరందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో కమిటీ సభ్యుల కృషి విశేషమైందని మంచిర్యాల శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అభినందించారు. కళల కాణాచి తెలంగాణ లో నిరవధికంగా 24 గంటల 24 నిమిషాల 24 సెకెన్ల పాటు  ప్రదర్శనలు చేయడం మంచిర్యాల చరిత్రలో మహాద్భుత ఘట్టం అన్నారు.

మంచిర్యాల నడిబొడ్డున ఈ కార్యక్రమం నిర్వహించి తెలంగాణకే తలమానికంగా నిలిపారని ప్రశంసించారు.
ప్రతిభ ఒక్కటే ప్రామాణికంగా పట్టం కట్టి  ప్రోత్సహించేందుకు శ్రీశ్రీకళావేదిక ఎప్పుడూ ముందు ఉంటుందని వేలాది మంది కవులు, వందలాది మంది కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్న సంస్థ తమదే అంటూ సంస్థ చైర్మన్, ప్రభుత్వం గుర్రం జాషువా అవార్డు గ్రహీత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. నెలకొక సాహిత్య కార్యక్రమం జరిపిస్తూ సంస్థ అన్ని రంగాల కళాకారులకు ఆసరాగా నిలుస్తోందన్నారు. సంప్రదాయ  కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై  ఉందన్నారు.  వెయ్యి మంది కళాకారులను ఒకే వేదికపై తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల 24 నిమిషాల 24 సెకెన్ల పాటునిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమం నాలుగు ప్రపంచ రికార్డుల్లో నమోదు అయ్యిందని   తెలిపారు .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరి పేర్లు ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు అసోషియేషన్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, కల్చరల్ తలెంత్స్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదవుకాబడ్డాయి .కార్యక్రమ నిర్వాహకురాలు కట్ల భాగ్యలక్ష్మి పేరును వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు చేసి అవార్డును అందచేసారు .

అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీకళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహించిన వరల్డ్ రికార్డ్ నమోదు కళాకారుల ప్రదర్శన కార్యక్రమం 24 గంటలపాటు  అట్టహాసంగా ముగిసింది. దేశవిదేశాల్లో  తదితర ప్రాంతాలతో పాటు దేశ నలుమూలల నుంచి వెయ్యి మంది కళాకారులు పాల్గొన్నారు. వీరికి నిర్వాహకులు  శ్రీశ్రీకళావేదిక తెలంగాణ మహిళా అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి ఉచిత భోజనం తో పాటు వసతి సౌకర్యం కల్పించారు. ముగింపు వేడుకల్లో మాజీ ఎం.ఎల్.సి. ప్రేమ్ సాగర్ అతిథిగా పాల్గొని కళాకారులను సత్కరించారు.

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ ప్రతినిధి మడుపు రామ్ ప్రకాష్  రికార్డు నమోదు ధ్రువీకరణ పత్రం, షీల్డ్ ను శ్రీశ్రీకళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో  ప్రతినిధులకు అందజేశారు. సభా సమన్వయకర్త గుండేటి యోగేశ్వర్ , పెద్ది.భరత్ , మహేందర్  నిర్వహించిన కార్యక్రమంలో  జాతీయ కన్వీనర్ కొల్లి.రమావతి, కమిటీ సభ్యులు ఏ.నరేంద్ర, చిట్టె లలిత,అమ్మూ బమ్మిడి,  నూక సంపత్, సిని దర్శకుడు రామ్,  జిల్లా సాహిత్య  కార్యవర్గ సభ్యులు పట్వర్థన్, తోకల రాజేషం,దండనాయకుల వామన్  , సొతుకు రత్నజానకి , స్వర్ణలత , వేదాంతం విశ్వప్రసాద్ , పద్మావతి ,శ్రీలక్ష్మి , జోత్స్న , గడ్డి రజిత , గాదాసు రజిత , సునీత మద్ది , మోటూరి  అర్పిత ,  తదితరులు పాల్గొన్నారు.  “రంగస్థలం” పేరుతో ఏర్పాటు చేసిన నాన్ స్టాప్ కార్యక్రమం పిలుపు ఇవ్వగానే అసంఖ్యాకంగా పేర్లు నమోదు చేసుకున్న కళాకారులందరికీ శ్రీశ్రీ కళావేదిక తెలంగాణ మహిళా అధ్యక్షురాలు, రంగస్థలం నిర్వాహకులు కట్ల భాగ్యలక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాల లో ఇంతమంది కళాకారులు వచ్చి నిరవధికంగా ప్రదర్శనలు ఇవ్వడం ఇదే మొదటిసారి అని, అది తన సారథ్యంలో జరగడం అదృష్టంగా భావిస్తున్న అన్నారు. అన్నిరంగాల వారికి ప్రోత్సహిస్తు ఇంత ఘన చరిత్రను సాధించేందుకు అవకాశం కల్పించిన శ్రీశ్రీకళావేదికలో తాను భాగస్వామ్యం కావడం గర్వకారణం అన్నారు. పాల్గొన్న వెయ్యి మంది కళాకారులకు శాలువా, జ్ఞాపిక, రికార్డు నమోదు సెర్టిఫికెట్ తో సత్కరించారు.

Avatar

rishisrisri

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *