Fashion Music Shooters కన్వీనర్ జిల్లా కమిటీ యువజన కమిటీలు/ యంగ్ తరంగ్ రాష్ట్ర కమిటీ

సాగర తీరంలో శ్రీ శ్రీ కళావేదిక సాహితీ ప్రభంజనం

సాగర తీరంలో శ్రీ శ్రీ కళావేదిక సాహితీ ప్రభంజనం

  •  – ఉప్పొంగిన కవన సాగరం
  • – శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ శతాధిక కవి సమ్మేళనం
  • – 170 మంది కవులకు ఘనంగా  సత్కారం

విశాఖ తీరాన కవుల కవిత్వాలు  కెరటాలై  ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి . సాగర తీరం కవుల కవనాలతో కవన సాగరంగా మారింది .ఐ.ఎస్ .ఓ గుర్తింపు పొందిన  అంతర్జాతీయ సాహిత్య ,సాంస్కృతిక, సేవా సంస్థ   శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జయంతి సందర్భంగా నిర్వహించిన  విశాఖ పట్టణం లోని ఆంధ్రా యూనివర్సిటీ  అంబేద్కర్ అసెంబ్లీ హాలు నందు  విశాఖ జిల్లా శాఖ జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు . ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలనుండి సుమారు ౧౭౦ మంది కవులు పాల్గొని కవితా గానం చేసారు . తొలుత బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ శ్రీ విగ్రహానికి శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . అనంతరం శ్రీ శ్రీ కళావేదిక విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాహితీ వేత్తలు ర్యాలి నిర్వహించారు .

ఈ సందర్భంగా  ఆంధ్రా యూనివర్సిటీ  అంబేద్కర్ అసెంబ్లీ హాలు నందు జరిగిన సమావేశంలో శ్రీ శ్రీ కళావేదిక  చైర్మన్, ప్రభుత్వ జాషువా అవార్డు గ్రహీత, ఏపీ సాహిత్య అకాడమీ  పూర్వ సభ్యులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ   ఆధునిక సాహిత్య చరిత్రలోనే చెరగని ముద్ర వేసిన శ్రీశ్రీ తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాయి  అన్నారు. ఈ శతాబ్దం నాది అని సగర్వంగా చెప్పుకొన్న శ్రీశ్రీ కవిత్వం నేటి కవులకు ఆదర్శం అన్నారు.

సమాజహిత ఆలోచనలతో కవులు తమ కలాలకు పదును పెట్టి గళాన్ని వినిపించినపుడే కవిత్వం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు. శ్రీశ్రీ పుట్టిన ఈ సుందర నగరం, సాహితీ వీచిక విశాఖ తీరంలో ఆయన జయంతి సందర్భంగా  ఈ కార్యక్రమం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. శ్రీశ్రీకళావేదిక పదేళ్ల సాహితీ ప్రస్థానంలో వేలాది మంది కవులను గుర్తించి, ప్రోత్సహిస్తూ నిరంతర వినూత్న కార్యక్రమాలతో నూతన ఒరవడి సృష్టించిన ఘనత తమ సంస్థకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. యువకవులు సమాజాభివృద్ధి దిశగా మరింత కృషి చేయాలని కోరారు. ముఖ్య అతిధులుగా విచ్చేసిన పద్మశ్రీ డాక్టర్ కూటి గుప్పల సూర్యారావు మాట్లాడుతూ శ్రీ శ్రీ కళావేదిక చేస్తున్న సాహిత్య సేవలను కొనియాడారు . శ్రీ శ్రీ కవిత్వం ద్వారా 

ఎందరొ వర్ధమాన కవులు తయారయ్యారన్నారు . కవులు , భాషాభిమానులు , సాహితీ వేత్తలు సమాజంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు . భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ చైర్ పెర్సన్ బోయి హైమవతి మాట్లాడుతూ ఆధునిక సాహిత్యంలో శ్రీ శ్రీ ఒక మైలురాయి అన్నారు . 

ఎమ్మెల్సీ పీ.వీ.ఎన్.మాధవ్ మాట్లాడుతూ శ్రీ శ్రీ సాహిత్యం కొన్ని తరాలకు గుర్తిండిపోయే సాహిత్యం అన్నారు . శ్రీ శ్రీ విశాఖ వాసి కావడం అదృష్టం అన్నారు . కవులు శ్రీ శ్రీ బాటలో పయనించాలన్నారు . జిల్లా గ్రంధాలయ చైర్పర్సన్ కొండా రమాదేవి మరియు వైసిపి అధికార ప్రతినిధి కొండా రాజీవ్ లు విశిష్ట అతిధులుగా హాజరై ప్రసంగించారు .శ్రీశ్రీకళావేదిక ఆధ్వర్యంలో కవులను ప్రోత్సహించేందుకు ఉగాది కవితా పోటీలతో పాటు,  శ్రీశ్రీ జయంతి సందర్భంగా పల్లెగూటికి పండగొచ్చింది సినిమా యూనిట్ నిర్వహించిన  కవితా పోటీల్లో ముప్పై మంది విజేతలకు సభలో మొత్తం  ముప్పై వేల రూపాయలు నగదు  బహుమతులు అందజేసారు. అలాగే కవి సమ్మేళనం లో ఉత్తమ పది కవితలను ఎంపిక చేసి ప్రత్యేక బహుమతులు అందజేశారు. భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ చైర్ పెర్సన్ బోయి హైమవతి భీమన్న ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇరు రాష్ట్రాల నుంచి విచ్చేసిన 170 మంది కవులు తమ కవితలను వినిపించారు. కవులందరికీ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. విశాఖ జిల్లా శ్రీ శ్రీ కళావేదిక గౌరవ అధ్యక్షడు సత్తివాడ శ్రీకాంత్ పాటల మాటల రచయితగా రూపొందించే  మహాకవి సినిమా పోస్టర్ ను సభలో అతిధులు ఆవిష్కరించారు . శ్రీ శ్రీ జీవితం మహాకవి పేరుతో తెరకెక్కడం దర్శకుడు రత్నం  వేణుగోపాల్ తెరకెక్కించడం  అభినందనీయం అన్నారు . తొలుత చిన్నారి చేసిన భరత నాట్యం అలరించింది .ప్రార్ధనా గీతం వసుమతి దేవి ఆలపించారు . .

శ్రీ శ్రీ కళావేదిక విశాఖ కన్వీనర్ రాచూరి సాయి గోపాల్ సాహితీ గీతాన్ని ఆలపించారు . శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు వై . సూర్యనారాయణరాజు అధ్యక్షతన , శ్రీ శ్రీ కళావేదిక కార్యదర్శి గౌరీ పతి శాస్త్రి యాంకరింగ్ తో సమావేశం ఆద్యంతం అద్బుతంగా నిర్వహించారు . శ్రీ శ్రీ కళావేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాధం సారధ్యంలో కవి సమ్మేళనం ఏర్పాట్లు చేసారు .

కవులకు పసందైన విందు ఏర్పాట్లను  తదితర కార్యక్రమాలను జగన్నాధం పర్యవేక్షించారు .  వై . సూర్యనారాయణ రాజు అధ్యక్షతన  కార్యక్రమ నిర్వహణ ముగింపు వరకు ఆద్యంతం అలరించింది . విశాఖ కార్యవర్గ గౌరవ అధ్యక్షుడు సత్తివాడ శ్రీకాంత్ , కార్యవర్గ సభ్యులు సత్య  కామరుషి , పద్మావతి మరియు   శ్రీశ్రీకళావేదిక కన్వీనర్ కొల్లి రమావతి,  అధ్యక్షుడు ఆరవెల్లి నరేంద్ర, ఉపాధ్యక్షురాలు చిట్టె లలిత, జాతీయ కార్యదర్శులు  ఈశ్వరిభూషణం, రిషి తణుకు, మిరప మహేష్, మీడియా ప్రతినిధి  అమ్ము బమ్మిడి, డా .పి, శ్రీనుబాబు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి , ఆంధ్రా రాష్ట్ర  సహాయ కార్యదర్శి  సి.హెచ్ రవి కుమార్, పల్లె గూటికి  పండగొచ్చింది చిత్ర దర్శకుడు  తిరుమలరావు , సంగీత దర్శకుడు  సింధు కే ప్రసాద్ , ఆకాశవాణి  అనౌన్సర్  బండి సత్యనారాయణ  ,ఉమా మహేశ్వరీ  తదితరలు పాల్గొన్నారు .  

Avatar

rishisrisri

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *